Revanth Reddy CM : సామాన్యుడి నుంచి సీఎం దాకా

అనుముల రేవంత్ రెడ్డి ప్ర‌స్థానం

Revanth Reddy CM : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం కొండారెడ్డి ప‌ల్లి గ్రామం స్వస్థ‌లం రేవంత్ రెడ్డిది. ఒక‌ప్పుడు సామాన్యుడిగా ఉన్న ఆయ‌న ఉన్న‌ట్టుండి సీఎం ఊరికే కాలేదు. ఎన్నో ఎత్తుప‌ల్లాలు ఉన్నాయి. కేసులు, అరెస్ట్ లు, ఆరోప‌ణ‌లు అన్నింటీని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం జెడ్పీటీసీగా ప్రారంభ‌మై చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి అనే టార్గెట్ తో పూర్త‌యింది. ఇది ఒక ర‌కంగా ఒక సినిమాకు కావాల్సినంత స‌రుకు రేవంత్ రెడ్డికి(Revanth Reddy) ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

Revanth Reddy CM Confirmed

న‌వంబ‌ర్ 8న 1969లో పుట్టాడు. ఆయ‌న‌ది మ‌ధ్య త‌ర‌గ‌తి రైతు కుటుంబం. బాంధవ్యాల‌కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తారు. ఒక ర‌కంగా అంద‌రితో క‌లిసి పోయే మ‌న‌స్త‌త్వం. ఒక‌ప్పుడు జ‌ర్న‌లిస్ట్ గా ఏబీవీపీ కార్య‌క‌ర్త‌గా ప్రారంభ‌మైంది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి రియ‌ల్ ఎస్టేట్ దాకా వ్యాపారం చేశాడు. ఆ త‌ర్వాత పాలిటిక్స్ లోకి రావ‌డంతో సీన్ మారింది. 2006లో తొలిసారిగా మిడిల్జ్ మండ‌ల జెడ్పీటీసీగా గెలుపొందాడు.

2007లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా విజ‌యం సాధించి విస్తు పోయేలా చేశాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి కొడంగల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో రెండోసారి విక్ట‌రీ సాధించాడు. 2014 నుంచి 2017 వ‌ర‌కు మూడేళ్ల పాటు టీడీపీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆఖ‌రున ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

2018లో టీపీసీసీ లో కీల‌క పోస్టుకు ఎంపిక‌య్యాడు రేవంత్ రెడ్డి. 2018లో కోడంగ‌ల్ లో ఓట‌మి పాల‌య్యాడు. 2019లో మ‌ల్కాజ్ గిరి నుంచి ఎంపీగా విజ‌యం సాధించాడు. జూన్ 26న 2021లో పీసీసీ అధ్య‌క్షుడిగా కొలువు తీరాడు. డిసెంబ‌ర్ 7 2023లో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశాడు.

Also Read : Heavy Rains : కుండపోత వ‌ర్షం గుండె కోత‌

Leave A Reply

Your Email Id will not be published!