Revanth Reddy : ఈ విజయం శ్రీకాంతాచారికి అంకితం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : కామారెడ్డి – తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఒక్కటి తప్ప గంప గుత్తగా అన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. దీనిపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఖేల్ ఖతమై పోయిందన్నారు. తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుందని, ఇదే మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.
Revanth Reddy Comment
ఈ సందర్బంగా ఈ విజయాన్ని అమరుడు శ్రీకాంతాచారికి అంకితం ఇస్తున్నానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లు దాటవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సుమానీ వచ్చిందని, తాను ముందు నుంచి చెప్పినట్లు 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
గతంలో ఎప్పుడైనా ఎన్నికల సందర్బంలో సీఎం కేసీఆర్ వచ్చి మీడియా ముందుకు వచ్చే వారని, కానీ ఆయన తనయుడు కేటీఆర్ రావడం అంటేనే బీఆర్ఎస్ ఓటమి ఖాయమై పోయిందన్నారు. ఇంతకంటే ఇంకేం కావాలన్నారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నిద్ర పోకుండా పహారా కాసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడించినందుకు ఆనందంగా ఉందన్నారు. మీ నియోజకవర్గాన్ని మరిచి పోలేనని అన్నారు.
Also Read : Vijay Devarakonda : అభివృద్దికి ఓటు వేశా