Revanth Reddy KCR : 24 గంటలు కరెంట్ ఇస్తే తప్పుకుంటా
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ్ల మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వేడిని రాజేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాను 3 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తానని అనలేదన్నారు.
Revanth Reddy Challenge Viral
ఇదే సమయంలో రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తానని సీఎం అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా కరెంట్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే ఇప్పుడే తాను ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తాను రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్ లలో నమోదు చేసిన విద్యుత్ సరఫరాకు సంబంధించి లాగ్ బుక్ లను తీసుకు రావాలని సవాల్ విసిరారు. ఒకవేళ తాను వాటిని తీసుకు రాక పోతే తాను ఎన్నికల నుంచి తప్పు కోవాలని, సీపెం పదవికి కేసీఆర్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.
మాయ మాటలు చెబుతూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న నయ వంచకుడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. ఇకనైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తాను విసిరే సవాల్ ను స్వీకరించే దమ్ము ఉందా అని సీఎంను ప్రశ్నించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : Vijaya Sai Reddy : పురందేశ్వరిపై విజయ సాయి సెటైర్