Revanth Reddy : స్వ‌తంత్రం కాంగ్రెస్ పుణ్యం – రేవంత్

గాంధీ భ‌వ‌న్ లో ఇండిపెండెన్స్ డే

Revanth Reddy : దేశానికి స్వేచ్ఛ ల‌భించిన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్య‌మేన‌ని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. 77వ స్వాతంత్ర దినోత్స‌వం స‌ద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో ఘ‌నంగా స్వాతంత్ర పండుగ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ ప‌తాకాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆవిష్క‌రించారు.

Revanth Reddy Words About August 15th

ఈ సంద‌ర్బంగా పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, శ్రేణులు, అభిమానుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎంద‌రో అమ‌రుల త్యాగం, బ‌లిదానాల వ‌ల్ల‌నే ఇవాళ మ‌నం స్వేచ్ఛ‌గా ఊపిరి పీల్చుకుంటున్నామ‌ని అన్నారు. దేశం కోసం పోరాడిన వీరులను గుర్తు చేసుకోవ‌డం మ‌నంద‌రి క‌ర్త‌వ్య‌మ‌ని అన్నారు. వారు అందించిన స్పూర్తితో మ‌నం ముందుకు వెళ్లాల‌ని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్‌

ఆంగ్లేయుల దాస్య శృంఖ‌లాల నుండి భార‌త దేశాన్ని విడిపించేందుకు చేసిన ఉద్య‌మాలు, పోరాటాలు చ‌రిత్ర‌లో క‌ల‌కాలం నిలిచి పోతాయ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. నేటి యువ‌త ఆ స్పూర్తిని పుణికి పుచ్చుకోవాల‌ని, దేశం కోసం , ప్ర‌జ‌ల బాగు కోసం కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు . రాబోయే రోజుల్లో మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేందుకు ఆనాటి స్వ‌రాజ్య ఆకాంక్ష స్పూర్తిని అంది పుచ్చుకోవాల‌ని ముందుకు రావాల‌న్నారు.

Also Read : Temjen Imna Along : జెండాకు జై కొట్టిన ఇమ్నా

Leave A Reply

Your Email Id will not be published!