Revanth Reddy : కామారెడ్డి – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం భారీ జన సందోహం వెంట రాగా కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ పోటీ తీవ్రం కానుంది. అందరి కళ్లు ఇప్పుడు కామారెడ్డి పైనే ఉండనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. పనిగట్టుకుని తాను బరిలోకి దిగుతున్నానని ఇంతకు ముందే ప్రకటించారు.
Revanth Reddy Nomination from Kamareddy
దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. మరో వైపు గజ్వేల్ నుంచి కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా కేసీఆర్ గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.
మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండు చోట్ల పోటీ చేస్తుండడం విశేషం. ఆయన కోడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా బరిలో ఉన్నారు. ఈ రెండింట్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి వెంట కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఉన్నారు.
Also Read : Tula Uma : తుల ఉమ కంట తడి