Revanth Reddy: ఆయన వల్లే కేటీఆర్‌ ఐటీ చదివి అమెరికా వెళ్లారు: సీఎం రేవంత్‌రెడ్డి

ఆయన వల్లే కేటీఆర్‌ ఐటీ చదివి అమెరికా వెళ్లారు: సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మాట్లాడారు. రాష్ట్రానికి గ్రామాలే పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ. 72,73వ రాజ్యాంగ సవరణ ద్వారా నేరుగా గ్రామాలకు నిధులు కేటాయించారు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేశారు.

Revanth Reddy Comment

త్యాగం అంటే ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉంది. రూ.వేల కోట్ల సంపదను దేశం కోసం త్యాగం చేసిన నాయకుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి, స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ఐక్యంగా ఉంచిన నేత నెహ్రూ. ఆయన కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆయన పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యతా తీసుకోలేదు. కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి పదువులు పొందుతున్నారు. బ్యాంకులను ప్రభుత్వపరం చేసి పేదలకు ఇందిరా గాంధీ మంచి చేశారు. లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టింది ఇందిరా గాంధీ కాదా? దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా.. అని అన్నారు. రాజీవ్‌ గాంధీ సాంకేతిక విప్లవం తీసుకురావడం వల్లే ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడగలుతున్నాం. ఆయన వల్లే కేటీఆర్‌ ఐటీ చదివి అమెరికా వెళ్లారు.

రాజీవ్‌ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఏ పదవీ తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్లవి. తెలంగాణ బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా గాంధీ కాదా?గాంధీ కుటుంబం గురించి కేసీఆర్‌ కుటుంబానికి తెలుసా? అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా?గత పాలకులు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నారట. పదేళ్లలో ఎందుకు పెట్టలేదు?కేసీఆర్‌కు తీరిక లేదా? ఆయన విగ్రహం పెట్టుకోవడానికి ఇక్కడ స్థలం ఉంచుకున్నారు. రాజీవ్‌ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం. తొలగించే టైం చెప్పండి అని సీఎం అన్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : Sub Register Office: సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు

Leave A Reply

Your Email Id will not be published!