Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇంకా తెలుగుదేశం పార్టీ వాసనలు పోనట్టుంది. పదే పదే చంద్రబాబు గురించి, టీడీపీ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ. 2014లో, 2018లో అధికారంలోకి వచ్చింది.
Revanth Reddy Comment
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కలలు కంటోంది. ఇదే సమయంలో కొన్ని సర్వే సంస్థలు హస్తం పట్ల ప్రజలు ఆదరణ కనిపిస్తున్నారని, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో జాతీయ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ ను కాంక్రీట్ జంగిల్ గా మార్చేశారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ కు అదనంగా అమరావతి తరహాలో సిటీని ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించారు.
Also Read : Komaram Dhanalaxmi : సీతక్కకు షాక్ డీసీసీ చీఫ్ జంప్