Revanth Reddy : బీఆర్ఎస్ మేనిఫెస్టో వేస్ట్ పేపర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. దమ్ముంటే తన సవాల్ ను సీఎం కేసీఆర్ స్వీకరించాలని అన్నారు. తాజాగా బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీకి సంబంధించి మేని ఫెస్టోను విడుదల చేశారు.
Revanth Reddy Slams BRS Party
ఈ సందర్బంగా తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను పూర్తిగా కేసీఆర్ కాపీ కొట్టారంటూ ఆరోపించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం పనై పోయిందని ఎద్దేవా చేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు.
బీఆర్ఎస్ మేని ఫెస్టో చిత్తు కాగితం లాంటిదని ఎద్దేవా చేశారు. అదిగో ఇదిగో అంటూ బిల్లా రంగాలు గొప్పగా చెప్పారని, చివరకు చూస్తే ఇందులో ఏమీ లేదన్నారు. అవే డైలాగులు, అవే హామీలు తప్ప కొత్తగా కేసీఆర్ చెప్పింది ఏముందంటూ ప్రశ్నించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇప్పటికే లక్ష కోట్లకు పైగా దోచుకున్న కల్వకుంట్ల కుటుంబానికి డెడ్ లైన్ పూర్తయిందన్నారు. ఇక జైలుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాము పవర్ లోకి వచ్చాక అందరి భరతం పడతామని, ప్రత్యేకించి కేసీఆర్ చెరసాలకు వెళ్లడం తప్పదన్నారు.
తెలంగాణ తెచ్చినందుకు గతంలో కొంత గౌరవం ఉండేదని , ఇప్పుడు ఆ ఉన్నపాటి గౌరవం కూడా పోయిందన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : CM KCR : మనదే విజయం నేనే సీఎం