Revanth Reddy : నాగర్ కర్నూల్ – నేను మట్టితనం కలబోసుకున్న స్వచ్ఛమైన పాలమూరు జిల్లా బిడ్డను. ఈ నేల ఎందరికో జన్మ నిచ్చింది. ఇంకెందరినో గల్లీ నుంచి ఢిల్లీకి పంపింది. ఈ ఘనత మీదే. ఆనాడు రంకెలేసిన ఎన్టీఆర్ ను ఓడగొట్టింది కల్వకుర్తి నియోజకవర్గమే. పాలమూరు బిడ్డలు కష్ట జీవులు.
Revanth Reddy
పొట్ట చేత పట్టుకుని వలస పోయినా ఊరు మరిచి పోరు. ఆత్మ గౌరవానికి, నిలువెత్తు పౌరుషానికి ప్రతీక ఈ జిల్లా.ఈసారి సీఎం అయ్యే అరుదైన అవకాశం పాలమూరు బిడ్డనైన నాకు దక్కనుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
75 ఏళ్ల తర్వాత సోనియా గాంధీ నాకు టీపీసీసీ చీఫ్(Revanth Reddy) పదవి కట్టబెట్టిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను కల్పించినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఇలాంటి అవకాశం ఇంకెప్పుడూ రాదన్నారు రేవంత్ రెడ్డి.
పాలమూరు పసిడి పంటల ప్రాంతంగా మారాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తనకు ఈ ప్రాంతంతో ఎనలేని అనుబంధం ఉందన్నారు టీపీసీసీ చీఫ్.
Also Read : National Herald Case : సోనియా..రాహుల్ కు బిగ్ షాక్