Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

Revanth Reddy : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వరుని 892వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)… బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్‌ కి ఘాటైన వ్యాఖ్యలతో ధీటైన జవాబిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎన్ని బస్సులు కావాలంటే… అన్ని బస్సులు ఇవ్వాలని చెప్పామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని మా అభిప్రాయం. బీఆర్ఎస్ సభలో ప్రభుత్వానికి ఏవైనా సూచనలు.. సలహాలు ఇస్తారని భావించామని.. కానీ అలా జరగలేదు. ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు.. ఆ పార్టీ నేతలకు ప్రజా సమస్యలు పట్టవు.

Revanth Reddy Slams KCR

ప్రజాసమస్యలను పట్టించుకోకుండా.. ఫాంహౌస్‌లో ఉంటూ.. రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేసీఆర్‌ను సీఎం ప్రశ్నించారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని… కేసీఆర్‌ ఫాంహౌస్‌ కే పరిమితం అవుతారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను… గత పదేళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్లైందంటూ సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఏ అంశంపై నైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్‌… కేసీఆర్‌ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమ నిర్ణయాల్లో ఏవైనా లోపాలుంటే చెప్పాలన్నారు. పదేళ్లు మీరు దోచుకుని… మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఉద్యోగం ప్రజలు ఎందుకు పీకేశారో అర్థం కాలేదా అని అన్నారు.

కేసీఆర్‌.. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా.. అధికారంలో లేకపోతే గాలికొదిలేసి పోతారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ తెచ్చిన ఏ పథకం ఆగిందో కేసీఆర్‌ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం, రుణమాఫీ, ఉద్యోగాలపై చర్చిద్దామని.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్ చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కేసీఆర్‌కు కనిపించడం లేదా అని సీఎం ప్రశ్నించారు.

Also Read : CM Revanth Reddy: ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ! ఎందుకంటే ?

Leave A Reply

Your Email Id will not be published!