Revanth Reddy : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
కల్వకుంట్ల కుటంబంపై కన్నెర్ర
Revanth Reddy : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ నేతల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నారు. ఆలంపూర్ లోని జోగులాంబలో కొలువు తీరిన అమ్మ వారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) దర్శించుకున్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
Revanth Reddy Comments Viral
ప్రధానంగా పత్రిక, మీడియా భాషలో మాట్లాడలేని విధంగా నోరు పారేసుకున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఏకి పారేశారు. తాము పవర్ లోకి రావడం ఖాయమని, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్ రావులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ పేరుతో నిట్ట నిలువునా దోపిడీకి పాల్పడిన ఘనమైన చరిత్ర వీరికే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని, ఇక ఫామ్ హౌస్ లో కూర్చుంటానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు రేవంత్ రెడ్డి.
డిసెంబర్ 9న తాము ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, కల్వకుంట్ల ఖాన్ దాన్ ను ప్రజల పరం చేస్తామని ప్రకటించారు. ప్రజల తీర్పును శిరసావహించాల్సిందేనని పేర్కొన్నారు. చరిత్రలో తాము నియంతలమని విర్ర వీగిన వాళ్లంతా ఇవాళ మట్టిలో కలిసి పోయారని గుర్తు చేశారు. ఇకనైనా కేసీఆర్ తప్పు తెలుసుకుని క్షమించమని అడగాలని డిమాండ్ చేశారు.
Also Read : Minister KTR : అలంపూర్ గులాబీ అభ్యర్థి మార్పు
