Minister KTR Modi : ఓట్ల కోసం బీజేపీ బీసీల జ‌పం

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR Modi : హైద‌రాబాద్ – కేవ‌లం ఓట్ల కోసం బీజేపీ బీసీల జ‌పం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR). బీసీలకు సంబంధించి ఇంత వ‌ర‌కు ఇన్నేళ్లుగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ , సంకీర్ణ స‌ర్కార్ ఏం చేసిందో చెప్పాల‌న్నారు. ముందు శ్వేత ప‌త్రం విడుద‌ల చేసే ద‌మ్ముందా అని ప్ర‌శ్నించారు. కేవ‌లం ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే బీసీలు మోదీకి గుర్తుకు వ‌స్తార‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న బీసీ రూపంలో ఉన్న అస‌లు, సిస‌లైన అరాచ‌క‌, అగ్ర‌వ‌ర్ణ వాది అంటూ ఆరోపించారు కేటీఆర్.

Minister KTR Modi Comments

ఎవ‌రు ఏ పార్టీకి బీ టీమ్ అనేది తెలంగాణలోని నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీ టీమ్ కాద‌ని స్ప‌ష్టం చేశారు . రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం ఎవ‌రితోనైనా, ఎక్క‌డి దాకానైనా పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ఒక్క‌టేన‌ని అన్నారు కేటీఆర్.

నిన్న‌టి దాకా మ‌తాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేశార‌ని, కానీ ఇప్పుడు సీన్ మార్చేశార‌ని, తెలంగాణ‌లో కుల రాజ‌కీయాల‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌దేళ్ల పాల‌న‌లో బీసీల గోస మ‌రింత పెరిగిందే త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు. ఎంత సేపు మ‌తం పేరుతో పాలిటిక్స్ చేయ‌డం త‌ప్ప ఈ దేశానికి చేసింది ఏముందంటూ నిల‌దీశారు కేటీఆర్. ఇక‌నైనా బీసీల జ‌పం మానేసి దేశ ప్ర‌జ‌ల గురించి ఆలోచిస్తే మంచిద‌ని సూచించారు.

Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!