Congress Slams : బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటది
నోరు జారిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
Congress Slams : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సీరియస్ గా స్పందించింది. బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ తమ పార్టీ పట్ల, నేతల పట్ల చేస్తున్న కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ముందు నుంచీ చెబుతూనే వచ్చామని బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తాజాగా కేసీఆర్ నోరు జారిన వీడియోను ట్విట్టర్ వేదికగా బుధవారం పంచుకుంది.
Congress Slams BJP and BRS
ఎన్నికల ప్రచార సభలో భాగంగా సీఎం కేసీఆర్ నోరు జారారు. కాంగ్రెస్ పార్టీ వెనుక కాంగ్రెస్(Congress) ఉంటది..బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటది అన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బై బై కేసీఆర్ హ్యాష్ ట్యాగ్ తో వైరల్ గా మారింది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదలవుతాయి. 9న కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. మరో వైపు ఇప్పటి వరకు 116 సీట్లను ఖరారు చేసింది. ఇంకా మూడు సీట్లను పెండింగ్ లో ఉంచింది.
ఈనెల 10 వరకు డెడ్ లైన్ విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. 13న పరిశీలన ఉంటుంది. ఇప్పటికే ఈసీ కఠిన నిబంధనలు విధించింది. ప్రతిచోటా తనిఖీలు నిర్వహించినా యధేశ్చగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : Minister KTR Modi : ఓట్ల కోసం బీజేపీ బీసీల జపం
