Revanth Reddy SIT Paper Leak : పేపర్ లీక్.. రేవంత్ ను సీట్ విచారణ
అందరిలో ఉత్కంఠ
Revanth Reddy SIT Paper Leak : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారం. ఈ పేపర్ లీకేజిలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలను సిట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనితో సిట్ ముందుకు నేడు రేవంత్ వెళ్లనున్నారు. పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పేపర్ లీకేజిలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలను సిట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి(Revanth Reddy SIT Paper Leak), టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
వారు చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని..ఈనెల 23న రేవంత్ ను, 24న బందీగా సంజయ్ ను ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులు ఇచ్చే సమయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించి వెళ్లారు.
ఇక నేడు రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇస్తారు?. ఆ తరువాత ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇక సిట్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. తనకు నోటీసులు ఇచ్చిన మాదిరిగానే కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజిలో కేటీఆర్ పిఏ తిరుపతి హస్తం కూడా ఉందని..గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో సిరిసిల్లకు చెందిన 100 మంది క్వాలిఫై అయ్యారని రేవంత్ ఆరోపించారు.
ఈ క్రమంలో ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వగా నేడు విచారణకు హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. మల్లు రవి, అద్దంకి దయాకర్ సహా పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
Also Read : మోడీ పై పోస్టర్స్ ..100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు !