Revanth Reddy : అమరుల త్యాగాలు, బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణను నిట్ట నిలువునా ముంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ దయతలిస్తే తెలంగాణ వచ్చిందన్నారు.
Revanth Reddy Slams KCR
దేశం కోసం రాహుల్ కుటుంబం రక్తం ధార పోసిందని , కానీ మీ కుటుంబంలో ఒక్కరైనా తెలంగాణ కోసం చని పోయిన వారు ఉన్నారా అంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. అమరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న కుటుంబం మీదంటూ మండిపడ్డారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని, దళితుడిని సీఎం చేస్తానని, ప్రతి ఒక్కరికీ 3 ఎకరాలు పంచి పెడతానని చెప్పిన నీవు మాట మార్చావంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తెలంగాణకు దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు.
నియంత, నయా నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తం కావాలని కోరుకుంటున్నారని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇదిలా ఉండగా కల్వకుర్తి సభ సందర్భంగా రాహుల్ గాంధీ జిల్లెల గ్రామాన్ని సందర్శించారు. పంట నష్ట పోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించారు.
Also Read : Rakesh Reddy Anugula : బీజేపీకి బిగ్ షాక్