Revanth Reddy : హైదరాబాద్ – తమ పార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై గురువారం తెల్లవారు జాము నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఇవాళ ఐటీ దాడులకు దిగింది. దీనిపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy).
Revanth Reddy Slams IT Raids
ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను చూస్తే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తేలి పోయిందని పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని, అభ్యర్థులను టార్గెట్ చేసుకుని దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని ఆరోపించారు.
ఇవాళ ఏక కాలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ ఐటీ దాడులకు దిగడం శోచనీయమని పేర్కొన్నారు. ఇదే దర్యాప్తు సంస్థలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎందుకు జరగడం లేదంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
దీన్ని బట్టి చూస్తే మోదీ , కేసీఆర్ లు కాంగ్రెస్ పార్టీ సునామీని చూసి ఎంతగా భయ పడుతున్నారో అర్థమవుతోందన్నారు. పార్టీ వేవ్ ను ఆపేందుకు చేస్తున్న ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు టీపీసీసీ చీఫ్.
Also Read : Pawan Kalyan Go Back : పవన్ కళ్యాణ్ గో బ్యాక్