Revanth Reddy : కేటీఆర్ ఎన్టీఆర్ జపం చేస్తే ఎలా
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆంధ్రోళ్లు అవసరం లేదంటూ నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన కేటీఆర్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని దివంగత సీఎం ఎన్టీఆర్ పేరు జపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Slams KTR
గాంధీ భవన్ లో మంగళవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తండ్రీ కొడుకులు ఫక్తు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు.
పాలన పడకేసిందని, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేటీఆర్ తన పేరు నందమూరి తారక రామారావు పేరు తో ఉండడం తన అదృష్టమని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఇలాంటి నేతలను తెలంగాణ సమాజం నమ్మదన్నారు.
నిత్యం అవాస్తవాలు మాట్లాడే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు చుక్కలు చూపించడం ఖాయమన్నారు. జనం కాంగ్రెస్ పార్టీని దీవించేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : BRS WIN : తెలంగాణలో కేసీఆర్ హవా