Revanth Reddy : ఖాకీల తీరుపై రేవంత్ కన్నెర్ర
అరవింద్ కుమార్ పై ఆగ్రహం
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు అంశంపై ఫిర్యాదు చేసేందుకు నూతన సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే తాను స్పెషల్ చీఫ్‌సెక్రటరీ అరవింద్ కుమార్ అపాయింట్ మెంట్ కోరారని తెలిపారు రేవంత్ రెడ్డి. ఆయన అందుబాటులో లేరని తనకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు.
తాను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని , ఇదే తనకు గుర్తింపు కార్డు అని ఇంకెవ్వరి అనుమతి అక్కర్లేదన్నారు.
తాను సర్కార్ పై దాడి చేసేందుకు వెళ్లడం లేదన్నారు టీపీసీసీ చీఫ్. తాను కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చానని అన్నారు. మీకు ఎవరిచ్చారు తనను అడ్డుకునే అధికారం అంటూ పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా అరవింద్ కుమార్ అందుబాటులో లేరని, తాము వెళ్లనీయమంటూ ఖాకీలు సమాధానం ఇచ్చారు. దీనిపై రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు.
అరవింద్ కుమార్ లేక పోతే ఇంకో ఆఫీసర్ ఉండడా అని ప్రశ్నించారు. ఇలా ఎంత కాలం పోలీసులతో పాలన సాగిస్తారంటూ ప్రశ్నించారు. పోయే కాలం దగ్గర పడిందన్నారు. ఈ రాష్ట్రంలో ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : సచివాలయం సరే సమస్యల మాటేంటి