Revanth Reddy : ఉచిత విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపుతోందంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని స్పష్టం చేశారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కూడా ఓ వినియోగదారుడేనన్న విషయం మరిచి పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరి మెప్పు కోసం ఈ భారాన్ని మోపుతున్నారంటూ ప్రశ్నించారు.
అడ్డ గోలు వ్యవహారాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టక పోవడంతో డిస్కంలను అప్పులపాలు చేశారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
తెలంగాణ సర్కార్ ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం రూ. 16 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఈరోజు వరకు వారికి చెల్లించ లేదన్నారు.
మొత్తం చెల్లించకుండా కేవలం రూ. 6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తూ వస్తోందన్నారు. డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్ ఏదైనా ఉందంటే అది సర్కారేనని ఎద్దేవా చేశారు.
విద్యుత్ సంస్థ వైఫల్యాలకు , అప్పులపాలు కావడానికి లోపభూయిష్టమైన విధానాలతో పాటు సర్కార్ బాధ్యతా రాహిత్యం కూడా మరో కారణమని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులపై భారాన్ని మోపుతూ ఇక్కట్లకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. 30 నుంచి 50 యూనిట్లు వాడే సామాన్యులకు సైతం వేలల్లో డెలప్ మెంట్ ఛార్జీల పేరుతో మోత మోగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
విద్యుత్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇస్తున్న కేసీఆర్ కు పోయే కాలం దగ్గర పడిందన్నారు.
Also Read : దేశం కోసం రక్తం ధారపోస్తా