Revanth Reddy : అమర వీరులకు ఈ విజయం అంకితం
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని కట్ట బెట్టినందుకు నాలుగున్నర కోట్ల ప్రజలకు రుణపడి ఉన్నామని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన భారీ ర్యాలీ , భద్రత మధ్య గాంధీ భవన్ కు విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు సీనియర్ నాయకురాలు విజయ శాంతి హాజరయ్యారు.
Revanth Reddy Winning Comment
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానాలు చేసిన అమరులకు, తొలి అమరుడు శ్రీకాంతాచారికి అంకితం ఇస్తున్నామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రత్యేకించి ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదే సమయంలో ప్రధానంగా చెప్పు కోవాల్సింది ఏఐసీసీ మాజీ చీఫ్ , ఎంపీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ఖర్గేకు, ప్రియాంక గాంధీలకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం.. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు.. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందు ఉంటుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని , సీపీఐ, సీపీఎం, టీజేఎస్లతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు.. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తు్న్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో తమను అభినందించిన కేటీఆర్ కు థ్యాంక్స్ తెలిపారు రేవంత్ రెడ్డి.
Also Read : Manik Rao Thackeray : తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నాం