Supreme Court : మనీ లాండరింగ్ చట్టం తీర్పుపై సమీక్ష
విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
Supreme Court : భారత దేశంలో కీలకంగా మారిన మనీ లాండరింగ్ చట్టంకు సంబంధించిన తీర్పుపై గురువారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ( సుప్రీంకోర్టు )(Supreme Court) సమీక్షించనుంది.
ఇది అత్యంత కీలకమైనది. ఇక తెలుగువాడైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) జస్టిస్ నూతల పాటి వెంకట రమణ శుక్రవారం ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన స్థానంలో జస్టిస్ యుయు లలిత్ కొలువు తీరుతారు. ఆయన కేవలం 74 రోజుల పాటు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ప్రముఖ న్యాయమూర్తిగా పేరొందిన చంద్రచూడ్ పదవీ బాధ్యతలు చేపడతారు.
ఇదిలా ఉండగా గత నెలలో ఒక తీర్పులో , అనేక పిటిషన్లలో సవాల్ చేయబడిన చట్టం ప్రకారం శోధించేందుకు , స్వాధీనం చేసుకునేందుకు అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు విస్తృత అధికారాలను కోర్టు సమర్థించింది.
ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ చట్టం కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన దావాపై విచారించేందుకు అత్యున్నత న్యాయ స్థానం అంగీకరించింది. విచారణ చేపడుతోంది.
ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం(PM Modi) కావాలని తమ వారిని కాకుండా బీజేపీయేతర పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ వస్తోందంటూ ఆరోపించారు పిటిషన్ లో.
250 మంది పిటిషనర్లు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిందితులకు కారణం లేదా సాక్ష్యంగా గురించి తెలియ చేయని చోట అరెస్ట్ చేసే అధికారాన్ని తనిఖీ చేయని ఏజెన్సీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్దమని వాదించారు న్యాయవాదులు.
Also Read : మాజీ మంత్రి ఈశ్వరప్పకు వార్నింగ్