AP CM YS Jagan : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
అసెంబ్లీలో ప్రకటించిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ రంగంపై. తమ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. రైతుల అభ్యున్నతి కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు సీఎం.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఎక్కడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వ్యవసాయ రంగానికి తాము ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు.
బీమా సౌకర్యంతో పాటు నాణ్యమైన విత్తనాల సరఫరా నుంచి ఉత్పత్తుల విక్రయం దాకా మార్పు కనిపిస్తోందన్నారు,
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). అంతే కాకుండా రైతుల కోసం తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశామని చెప్పారు ఏపీ సీఎం. ప్రస్తుతం ఆర్బీకేలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని స్పష్టం చేశారు.
వ్యవసాయ మోటార్లకు అమర్చిన మీటర్లపై అదనపు మొత్తాన్ని వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని , నానో టెక్నాలజీని త్వరలో అమలు చేస్తామని చెప్పారు.
శాస్త్రీయ పద్దతిలో పురుగు మందులు పిచికారీ చేసేందుకు దాదాపు 2 వేలకు పైగా డ్రోన్ లను అందుబాటులోకి తీసుకు వస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
చంద్రబాబు నాయుడు నిర్వాకం కారణంగా ఏపీ తీవ్ర నష్టానికి లోనైనట్లు ఆరోపించారు సీఎం. వైఎస్సార్ రైతు భరోసా తో పాటు పీఎం కిసాన్ , బీమా , జీరో వడ్డీ పథకం, ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు.
Also Read : సీఎం జగన్ తో టాటా సన్ చైర్మన్ భేటీ