Ricky Ponting : యావత్ క్రికెట్ లోకాన్ని విస్మయానికి గురి చేస్తూ ఈ లోకాన్ని వీడాడు ప్రముఖ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్. ఆయన మరణం తమకు తీరని లోటు అని క్రికెటర్లు వాపోతున్నారు.
తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ కు అరుదైన గౌరవాన్ని తీసుకు వచ్చిన ఘనత షేన్ వార్న్ దే. కేవలం 52 ఏళ్ల వయసులో తనువు చాలించాడు. అనుకోని ఈ ఘటన ఆస్ట్రేలియా క్రికెట్ నే కాదు ఆ దేశానికి చెందిన ఆటగాళ్లను విస్మయానికి గురి చేసింది.
ప్రధానంగా తనతో కలిసి ఎన్నో మ్యాచ్ లలో ఆడిన ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యాడు. మిత్రమా నువ్వు లేవన్న నిజం నన్ను బాధిస్తోందంటూ వాపోయాడు.
ప్రస్తుతం రికీ పాంటింగ్ కన్నీళ్లు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా షేన్ వార్న్ తో తనకున్న ప్రత్యేకమైన బంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
దానిని మాటల్లో పేర్కొనడం చాలా కష్టమైనదని తెలిపాడు. తాను 15 ఏళ్ల సమయంలో ఓ అకాడెమీలో వార్న్ ను కలుసుకున్నా. ఆ సందర్భంగా తనకు ఓ నిక్ నేమ్ కూడా పెట్టాడు.
దశాబ్ద కాలం పాటు మేమిద్దరం కలిసి ఆడామని చెప్పాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో విజయాలు చూశామని అన్నాడు రికీ పాంటింగ్.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వార్న్ కు కుటుంబం అంటే చచ్చేంత ఇష్టం. ఆట తర్వాత తను ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమించే వాడని గుర్తు చేసుకున్నాడు.
Also Read : చెలరేగిన భారత్ తలవంచిన పాకిస్తాన్