RIP Twitter Viral : ట్విట్టర్ లోగో వైరల్
రిప్ ట్విట్టర్ అంటూ కామెంట్స్
RIP Twitter Viral : మైక్రో బ్లాగింగ్ సైట్ గా పేరు పొందిన ట్విట్టర్ తన అస్తిత్వాన్ని కోల్పోనుందా. అవుననే అనిపిస్తోంది. తన క్రెడిబిలిటీని దక్కించు కోలేక పోతోందా. ఎంతో కష్టపడి కోట్లాది మందిని ప్రభావితం చేస్తూ, వేలాది ఉద్యమాలకు , పోరాటాలకు, ఆరాటాలకు ఊపిరి పోసిన ట్విట్టర్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఒక రకంగా ఎన్నో సంఘటనలకు , వార్తలకు, విశేషాలకు ట్రెండింగ్ లో నిలిపే ట్విట్టర్ తానే వైరల్ గా మారడం విచిత్రం కాక మరేమిటి.
RIP Twitter Viral Logo
అతిరథ మహారథులకు ముచ్చెమటలు పట్టించిన ట్విట్టర్ ఇప్పుడు రాను రాను తన ప్రాభావాన్ని కోల్పోతోందన్న ఆందోళన నెలకొంది దానిని ప్రేమించే వారికి. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని రీతిలో ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాడు. భారీ ధర చెల్లించాడు. ఆయన చేతిలోకి తీసుకున్న వెంటనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఝలక్ ఇచ్చాడు. వేలాది మందిని తొలగించాడు.
టెక్కీలకు నిత్యం నరకం చూపించాడు. ఆపై తాను ఇక నుంచి ఫ్రీ సర్వీసెస్ ఇవ్వబోనంటూ ప్రకటించాడు. ఆపై బ్లూ టిక్ కావాలంటే డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశాడు. ట్విట్టర్ లో పోస్టులు చేయకుండా ఎవరూ ఉండలేరు. కోట్లాది మంది నిత్యం తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి ట్విట్టర్ కు ప్రాణప్రదంగా ఉంటూ, బ్రాండ్ అంబాసిడర్ స్థాయిని తీసుకు వచ్చేలా చేసిన లోగోను మార్చేశాడు ఎలోన్ మస్క్. దీంతో రిప్ ట్విట్టర్ అంటూ పేర్కొన్నారు నెటిజన్లు(RIP Twitter Viral). ఇదే ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Elon Musk Twitter : ఎలోన్ మస్క్ పై మండిపాటు