RK Roja Selvamani : బాలయ్య చిల్లర చేష్టలు మానుకో
నిప్పులు చెరిగిన ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : తాడేపల్లిగూడెం – ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. ఆమె టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.
RK Roja Selvamani Comments on Balakrishna
చంద్రబాబు నాయుడును వెనకేసుకు వస్తున్న బాలకృష్ణను ప్రజలు నమ్మరన్నారు. తన బావ తప్పు చేయలేదని నిరూపించు కోవాలని సవాల్ చేశారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani ). బావ జైళ్లో అల్లుడు ఢిల్లీలో ఉన్నారని , అరెస్ట్ చేస్తారనే భయంతో అక్కడక్కడ తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
స్కిల్ స్కాంపై చర్చ అనగానే బాలకృష్ణ అసెంబ్లీలో లేకుండా పోయాడని మండిపడ్డారు. చేసిన తప్పులకు ప్రజలకు చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు ఆర్కే రోజా. బాబు స్కాంలపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తొడ కొట్టిన బాలయ్య తోక ముడిచాడని మండిపడ్డారు. దమ్ముంటే , ధైర్యం అనేది ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు ఆర్కే రోజా సెల్వమణి. చర్చల్లో పాల్గొనకుండా కేవలం రచ్చ చేసేందుకే టీడీపీ సమయం కేటాయించిందని ఆరోపించారు. వీళ్లు ప్రజా ప్రతినిధులేనా అని ఆమె ప్రశ్నించారు.
Also Read : Perni Nani : స్కిల్ స్కాంలో బాబు కింగ్ పిన్