RK Roja Selvamani : వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం
స్పష్టం చేసిన మంత్రి ఆర్కే రోజా
RK Roja Selvamani : తిరుపతి – ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన కామెంట్స్ చేశారు. తాను త్వరలో జరగబోయే ఎన్నికల్లో బరా బర్ పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని తాను పట్టించు కోనని చెప్పారు. సోమవారం ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు.
RK Roja Selvamani Comment
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు. అందరితో చర్చించి పార్టీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు . టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటు కాలేదన్నారు.
ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకునేందుకు వారికి ఇంకా సమయం సరి పోలేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). విచిత్రం ఏమిటంటే టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో తెలియక తిక మక పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు .
వై నాట్ 175 సీట్లు అనే నినాదంతో తాము ముందుకు వెళతామని స్పష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. తనను విమర్శించే వారికి, ఆరోపణలు చేసిన వారికి తన గెలుపు మాత్రమే సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు.
Also Read : Gidugu Rudraraju : బీజేపీ అంటే బాబు..జగన్..పవన్