RK Roja Selvamani : సీఎం మాటే శిరోధార్యం
స్పష్టం చేసిన ఆర్కే రోజా
RK Roja Selvamani : తిరుపతి – ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీ చీఫ్ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏది చెప్పినా దానిని ఆచరించేందుకు, శిరసా వహించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు .
RK Roja Selvamani Comment
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ వారు అనుకున్నట్టు జరిగే ప్రసక్తి లేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారంటూ ఎద్దేవా చేశారు .
అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో తాను ఉంటున్నానని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తాను జగనన్న సైనికురాలినని చెప్పారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో తెలియక సతమతం అవుతున్నారంటూ మండిపడ్డారు. వాళ్లు పదే పదే సర్వేలు చేయించు కుంటున్నారని , వారు ఎక్కడి నుంచి బరిలో నిలవాలో వారికే క్లారిటీ లేకుండా పోయిందని అన్నారు.
ఆరు నూరైనా తమ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : CM Revanth Reddy : గ్రామ సభల్లోనే లబ్దిదారుల ఎంపిక