RK Roja Selvamani : చిత్తూరు – ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్క బెడుతున్న నారా చంద్రబాబు నాయుడికి ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించారు.
RK Roja Selvamani responded to Brahmani’s comments
దేని కోసం మోత మోగించాలో నారా బ్రాహ్మణి చెప్పాలని నిలదీశారు. స్కిల్ పేరుతో అడ్డగోలుగా రూ. 371 కోట్లు ప్రజల సొమ్మును కాజేసినందుకు సైరన్ , ఈల వేయాలా అని అన్నారు ఆర్కే రోజా(RK Roja Selvamani). మీ మామ చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకు వెళితే మీరేమో ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరడం ఎంత వరకు సబబో చెప్పాలన్నారు.
మీ మామ చేసిన అంతులేని అవినీతి, అక్రమాలకు 2019లోనే చెక్ పెట్టారని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. నీ భర్త నారా లోకేష్ ను అడ్రస్ లేకుండా మంగళగిరిలో ఓడించారో తెలుసుకోక పోవడం దారుణమన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పల్లాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటే ఎలా అని ఎద్దేవా చేశారు. మీ మామ మీద యావత్ ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరు భ్రమల్లో ఉన్నారని అది వాస్తవం కాదన్నారు. నారకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు.
Also Read : Bandaru Satyanarayana Murthy : రోజా నీ బ్లూ ఫిల్ములు రెడీ