RK Roja Pawan Kalyan : బాబు మాటలు వింటే అధోగతే – రోజా
పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్
RK Roja Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అన్నంతగా దూషణల పర్వం మొదలైంది. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లుతోంది. ఈ తరుణంలో వైసీపీ సర్కార్ పై టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ తో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరుగుతున్నారు. నియంత పాలనను సాగనంపాలని పిలుపునిస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు.
దీంతో తామేమీ తక్కువ కాదంటూ అధికార పార్టీ నాయకులు సై అంటున్నారు. గురువారం ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా(RK Roja) నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. బాబు మాటలు విన్న వాళ్లు ఎవరూ ఇప్పటి వరకు బాగు పడిన దాఖలాలు లేవన్నారు. ఆయన మాటలు వింటే అధోగతి పాలు కావడం తప్ప ఇంకొకటి ఉండదన్నారు.
కనీసం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టు చదవడం కంటే తనంతకు తానుగా ఏపీకి ఏం కావాలో తెలుసుకుంటే మంచిదని సెలవు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసినా లేదా కలిసి బరిలోకి దిగినా వార్ మాత్రం వన్ సైడ్ అవుతుందని, అది సింహం సింగిల్ గా సీఎం కుర్చీపై కూర్చుంటుందని స్పష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా.
Also Read : Bhatti Vikramarka : పొంగులేటికి సాదర స్వాగతం – భట్టి