Road Accident: ఆర్టీసీ బస్సు ఢీ కొని రాచకొండ అడిషినల్ ఏఎస్పీ మృతి
ఆర్టీసీ బస్సు ఢీ కొని రాచకొండ అడిషినల్ ఏఎస్పీ మృతి
Road Accident : తెలంగాణా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. హైదరాబాద్ లొరి హయత్ నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో అడిషినల్ ఎస్పీ టీఎం నందీశ్వర బాబ్జి మృతి చెందారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మార్నింగ్ వాక్ చేస్తున్న ఏఎస్పీ నందీశ్వర బాబ్జి() ను ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్పీ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఏఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాబ్జి మృతి పోలీసు శాఖను ఒక్కసారిగా విషాదంలో ముంచింది.
Road Accident – పరీక్ష రాసి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థిని మృతి
హైదరాబాద్(Hyderabad) నగరంలోని గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. టీఎన్‌జీవో కాలనీకి చెందిన యువకుడు… తన సోదరిని పదో తరగతి పరీక్ష రాయించేందుకు గచ్చిబౌలిలోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత తిరుగు ప్రయాణంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ కింద పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా… ఆమె అన్నకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు… ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
Also Read : CM Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్