Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఆరుగురి మృతి !
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ! ఆరుగురి మృతి !
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. రాంగ్ రూట్ లో వచ్చిన లారీని బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… క్షతగాత్రులను గిద్దలూరు ప్రభుతాసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆయా మృతదేహాలను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులంతా స్టువర్ట్‌పురం వాసులుగా పోలీసులు గుర్తించారు.
కారులోని వారంతా మహానంది వద్దనున్న మహాబలిపురం వెళ్లి… బాపట్ల తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. ప్రమాద సమయానికి ముందు కారు, లారీలు రెండు అధిక వేగంతో ప్రయాణిస్తున్నాయని.. అందుకే ప్రమాద తీవ్రత బాగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మరణించారని చెప్పారు. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి.. సమీపంలోని పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయిందని తెలిపారు. అలాగే
మృతుల వివరాలు
గజ్జల జనార్ధన్.
గజ్జల భవాని(20)
గజ్జల నరసింహ(20)
కర్రెద్దుల దివాకర్ (30)
గజ్జల బబ్లు(29)
బచ్చు సందీప్ అలియాస్ సన్నీ(30)