MLC Kavitha : కవిత జ్యూడిష కస్టడీ మరోసారి పొడిగించిన రౌస్ కోర్టు
అదే రోజున రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టనుంది...
MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు ఈరోజు (శుక్రవారం) రోస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత రిమాండ్‌ను మళ్లీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు కవిత కస్టడీని జూన్ 21 వరకు పొడిగించింది.
MLC Kavitha Case..
తదుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసిన న్యాయస్థానం.. అదే రోజున రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టనుంది. సీబీఐ కేసులో కవితపై దాఖలైన చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తను చదువుకోవడానికి తొమ్మిది కొత్త పుస్తకాలను సమర్పించాలని కవిత కోర్టును కోరారు. కవిత పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కవిత పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది.
Also Read : Nitish Kumar : ఎన్డీఏ పక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం