Rowdy Sheeter: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్
గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్
Rowdy Sheeter : గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్(Rowdy Sheeter) హల్ చల్ చేసాడు. హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లికి చెందిన రౌడీ షీటర్ అల్తాఫ్ మద్యం మత్తులో కాసినో ఈవెంట్ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయి హైదరాబాద్ వస్తుండగా గోవా దబోలిమ్ ఎయిర్ పోర్టు వద్ద రౌడీ షీటర్ ను గోవా పోలీసులు పట్టుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Hyderabad Rowdy Sheeter Sensation at Goa
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లికి చెందిన రౌడీ షీటర్(Rowdy Sheeter) అల్తాఫ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం గోవా వెళ్లాడు. బుధవారం రాత్రి గోవా పానాజీ క్యాంపుల్ లోని కాసినోకు వెళ్లారు. అక్కడ ఓ కాసినో వద్ద రౌడీ షీటర్ అల్తాఫ్ మద్యం మత్తులో హాంగామా సృష్టించాడు. అక్కడ సెక్యూరిటీ గార్డులుగా ఉన్న ధీరు శర్మ, సత్యం గోంకర్ లతో గొడవపడ్డాడు. దురుసుగా ప్రవర్తించవద్దని సెక్యూరిటీ గార్డులు కోరినప్పటికీ, అల్తాఫ్ వెనక్కి తగ్గలేదు. వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేసాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధీరు శర్మ మరణించాడు. అనంతరం అక్కడ నుండి హైదరాబాద్ పారిపోయే ప్రయత్నం చేయగా… గోవా ఎయిర్ పోర్టులో అల్తాఫ్‌ను గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో సెక్యూరిటీ గార్డు సత్యం గోంకర్ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ రాహుల్ గుప్తా సారధ్యంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట నిషేధం ఉండడంతో హైదరాబాద్ కు చెందిన రౌడీ షీటర్‌లు గోవాలో పేకాట ఈవెంట్‌లను నిర్వహిస్తూ… పేకాట రాయుళ్లను అక్కడికి విమానాల్లో తీసుకువెళ్లి కాసినో ఆడిస్తున్నట్లు సమాచారం.
Also Read : Trump Praises Musk : మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్