RRR Amul : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , ఆలియా భట్ నటించిన ఆర్ఆర్ఆర్ – రణం రౌద్రం రుధిరం మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది ఈ మూవీకి. ఇప్పటికే ప్రీ రిలీజ్ కే కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తీసేందుకు భారీ ఎత్తున జక్కన్న ఖర్చు చేశారని వినికిడి.
హాలీవుడ్ స్థాయికి తీసిపోని విధంగా ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించారు దర్శక ధీరుడు. బాలీవుడ్ కు చెందిన ఆలియా భట్ తో పాటు అజయ్ దేవగన్ కూడా ఇందులో నటిస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇక వరల్డ్ వైడ్ గా ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తోంది.
ఇక దేశంలోనే అత్యంత పేరొందిన డెయిరీ సంస్థల్లో అమూల్ కంపెనీ. గుజరాత్ కు చెందిన ఈ కంపెనీ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Amul )కు పేరడీగా ఓ పోస్టర్ , వీడియో తయారు చేసింది.
ప్రస్తుతం ఇది నెట్టింట్లో హల్ చల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కు రణం – రుధిరం – రౌద్రం అని ఉంటే డెయిరీ బ్రాండ్ అమూల్ రైజ్ – రోర్ – రివోల్ట్ (RRR Amul )కి అంకితం అంటూ పంచుకుంది.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ నుంచి ప్రేరణ పొందినట్లు తెలిపింది అమూల్. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తమ చేతుల్లో బ్రరెడ్ స్లైస్ తో ఉన్న ఫోటో ఆకట్టుకుంటోంది. దీనికి టెర్రఫిక్ బట్టర్ అని క్యాప్షన్ కూడా జత చేసింది.
Also Read : ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ హిట్ – తారక్