#RRR : ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడేట్లుందిగా..

ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

RRR : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బిగ్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టిఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముందు ఈ సినిమాను 2020 జూలై 31న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయం సరిపోదని 2021 జనవరి 8న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

అయితే కరోనా కారణంగా షూటింగ్ జరగకపోవడంతో సినిమా డేట్ వాయిదా పడింది. అయితే చాలా రోజులుగా సినిమా డేట్ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ డిస్ట్రిబ్యూటర్స్ కి నచ్చలేదని తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం తెలుస్తుంది.

ఎందుకంటే దసరాకి రిలీజ్ చేస్తే బాగానే ఉన్న కలెక్షన్ల పరంగా అంత వర్క్ అవుట్ అవ్వదనే భావిస్తున్నారట. ఈ సినిమా 450 కోట్ల భారీ బుడ్జెట్ తో రూపొందుతున్న విషం అందరికి తెలిసిందే. అందుకే దసరా సీజన్ కంటే సంక్రాంతి బాగా వర్క్ అవుట్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటున్నారట. అందుకే ఈ విషయం మీద నిర్మాతతో మాట్లాడి సినిమాను ఎలాగైనా 2022 సంక్రాంతి వాయిదా వేయాలని కోరనున్నారని సమాచారం.

No comment allowed please