RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ గా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

తెలంగాణ అధ్య‌క్షుడిగా మాయావ‌తి డిక్లేర్

RS Praveen Kumar : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ ను నియ‌మిస్తూ బీఎస్పీ చీఫ్ , మాజీ సీఎం మాయావ‌తి ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

అంత‌కు ముందు ఆయ‌న వీఆర్ఎస్ తీసుకున్నారు. అనంత‌రం బీఎస్పీలో చేరారు. రాష్ట్ర కో ఆర్డినేట‌ర్ గా నియ‌మించారు. తాను చేరిన వెంట‌నే బీఎస్పీని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

ర్యాలీలు చేప‌ట్టారు. గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకు వ‌స్తున్నారు. ఇందులో భాగంగా త‌న వాయిస్ మ‌రింత పెంచారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వాన్ని ఆయ‌న టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. త‌న‌ను నూత‌న అధ్య‌క్షుడిగా నియ‌మించిన సంద‌ర్భంగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) శుక్ర‌వారం హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. బ‌హుజ‌న రాజ్య పాల‌న రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

పాల‌కులు త‌మ సౌల‌భ్యం కోసం మాత్ర‌మే ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎంత మంది పీకేలు వ‌చ్చినా రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఆదుకోలేర‌న్నారు. రాబోయే రోజుల్లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ పై బ‌హుజ‌న జెండా ఎగ‌రడం ఖాయ‌మ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి రెడ్ల‌కే ప‌ద‌వులు ఉండాల‌ని పేర్కొనడాన్ని తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మ‌తం , కులం పేరుతో బీజేపీ రాజ‌కీయం చేస్తోంద‌న్నారు.

అన్ని పార్టీల‌లో ఉన్న బ‌హుజ‌నులంతా బీఎస్పీలోకి రావాల‌ని ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) పిలుపునిచ్చారు. బ‌హుజ‌న రాజ్యాధికార యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు 85 రోజులు పూర్త‌యింద‌ని ప‌వ‌ర్ లోకి వ‌చ్చేంత దాకా యాత్ర కొన‌సాగుతుంద‌న్నారు.

Also Read : మ‌హిళా ద‌ర్బార్ కొన‌సాగుతుంది

Leave A Reply

Your Email Id will not be published!