RS Praveen Kumar : సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఏది

సీఎం కేసీఆర్ పై ఆర్ఎస్పీ సెటైర్స్

RS Praveen Kumar : డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఏనాడూ ప్ర‌చారం కోరుకోలేదు. ఆయ‌న అన్ని వ‌ర్గాలు బాగుండాల‌ని ప‌రిత‌పించాడు. త‌న జీవిత‌మంతా ఈ దేశం కోసం ఖ‌ర్చు పెట్టాడ‌ని పేర్కొన్నారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar).

శుక్ర‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. బీఆర్ఎస్ పాల‌న‌పై, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ పేరుతో భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చార‌ని దీని కోసం ఖ‌ర్చు చేసిన డ‌బ్బుల్ని పేద‌ల కోసం కేటాయించి ఉంటే బాగుండేద‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ఏదో ఒక స‌మ‌స్య‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తూ ప్ర‌జ‌ల‌ను త‌మ పాల‌నను ప్ర‌శ్నించ‌కుండా చేయ‌డంలో భాగంగా సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడ‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

తాను రాష్ట్ర ప్ర‌భుత్వానికి 25 ప్ర‌శ్న‌లు అడిగాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప్ర‌శ్న‌కు స‌రైన సమాధానం చెప్ప‌లేద‌ని ఎందుక‌ని ప్ర‌శ్నించారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ఇవాళ‌నైనా ఆ ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో చోటు చేసుకున్న పేప‌ర్ లీకుల వ్య‌వ‌హారంలో అస‌లు దొంగ‌లు ఎవ‌రో చెప్ప‌లేద‌న్నారు. దీని వెనుక ఉన్నారో తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

Also Read : కొడాలి నానిపై చంద్ర‌బాబు సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!