RS Praveen Kumar : ఆర్ఎస్పీని అరెస్ట్ చేయొద్దు
ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు
RS Praveen Kumar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ , మాజీ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది. తమ ఆదేశాలను ఎవరైనా ధిక్కరించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కోర్టు.
RS Praveen Kumar BSP Chief
ఇదిలా ఉండగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పై సిర్పూర్, కాగజ్ నగర్ పీఎస్ లలో కేసులు నమోదు చేశారు పోలీసులు. తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బీఎస్పీ చీఫ్.
తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు వెనుకంజ వేశారు. తనతో పాటు తన కొడుకుపై కూడా హత్యా యత్నానికి పాల్పడినట్లు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ.
దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా, జనం గొంతుకగా తాను ఉండడం వల్లనే తనపై ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు.
Also Read : Rahul Gandhi : షమీ పర్ఫార్మెన్స్ సూపర్
