RS Praveen Kumar : గ్రూప్-2 ప‌రీక్ష వాయిదా కోసం ఆర్ఎస్పీ దీక్ష

ప్ర‌భుత్వ ద‌మ‌నకాండ కొన‌సాగుతోంది

RS Praveen Kumar : తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన గ్రూప్ -2 ప‌రీక్ష వాయిదా వేయాల‌ని కోరుతూ గ‌త కొన్ని రోజులుగా అభ్య‌ర్థులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. కార్యాల‌యం ఎదుట ధ‌ర్నా, నిర‌స‌న చేప‌ట్టారు. అయినా స‌ర్కార్ స్పందించ‌డం లేదు. ఆందోళ‌న చేప‌ట్టిన అభ్య‌ర్థుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ఈ మేర‌కు తాను కూడా గ్రూప్ -2 వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

RS Praveen Kumar Asking Group-2 Extension

ప్ర‌భుత్వం చేత‌గాని త‌నం వ‌ల్ల నేటికీ ల‌క్షాలాది జాబ్స్ ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేక పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌మ భ‌విష్య‌త్తు కోసం పోరాటం చేస్తున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. లక్షలాది నిరుద్యోగుల‌కు తాను మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ్రూప్ -2 ప‌రీక్ష‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని ఆయ‌న కోరారు.

ఇందుకు సంబంధించి శ‌నివారం మ‌ద్ద‌తు తెలిపేందుకు గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు చేరుకున్న త‌మ‌ను అన్యాయంగా అడ్డుకున్నార‌ని ఆరోపించారు ఆర్ఎస్పీ. శాంతియుతంగా స‌త్యాగ్ర‌హం చేయాల‌ని నిర్ణ‌యించాం. కానీ ప్ర‌భుత్వం కావాల‌ని త‌మ‌ను అడ్డుకుంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ నిరుద్యోగుల‌కు న్యాయం జ‌రిగేంత దాకా తాను దీక్ష చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Ambati Rambabu : లోకేష్ ఓ బ‌ఫూన్ – అంబ‌టి రాంబాబు

Leave A Reply

Your Email Id will not be published!