RS Praveen Kumar: బీఆర్ఎస్ లోకి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఆర్ఎస్ లోకి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

RS Praveen Kumar: ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీ పార్టీకు షాక్ ఇచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుని పదవికి ఆయన రాజీనామా చేసారు. రానున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తును బీజేపి భగ్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా దానిలో భాగమన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గి… తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని… అలాగని రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేనని ఆయన స్పష్టం చేసారు. దీనిలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చివరి వరకు తన మదిలో బహుజన వాదాన్ని పదిలంగా ఉంచుకుంటానని ఈ సందర్భంగా ఆయన స్వేరోలకు హామీ ఇచ్చారు.

RS Praveen Kumar Joined in…

‘‘నా రాజకీయ భవితవ్యంపై హైదరాబాద్‌లో ఆదివారం వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో మేధోమధనం జరిపాను. ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటే నడుస్తానని మాట ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వం, రాజ్యాంగ రక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం సోమవారం కేసీఆర్‌ సమక్షంలో ఆపార్టీలో చేరబోతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’’ అని ప్రవీణ్‌ కుమార్‌(RS Praveen Kumar) ఈమేరకు ట్వీట్‌ చేశారు.

Also Read : Model Code of Conduct: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ తొలి వేటు !

Leave A Reply

Your Email Id will not be published!