RS Praveen Kumar Alleged : లీకుల పర్వం ‘కల్వకుంట్ల’ హస్తం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar Alleged : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీక్ ల వ్యవహారంపై స్పందించారు. ఇవాళ దీక్ష చేపట్టారు. తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ మొత్తంగా స్కాం వెనుక కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. గతంలో టీఎస్ పీస్సీ లో నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
సంస్థలోని కాన్ఫిడెన్షియల్ విభాగంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన వారు ఉన్నారని అన్నారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని కానీ తాను సీబీఐకి , గవర్నర్ కు , హైకోర్టు చీఫ్ జస్టిస్ కు మాత్రమే ఇస్తానని అన్నారు. తనకు సిట్ పై నమ్మకం లేదన్నారు. దీని వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ప్రవీణ్ , రాజశేఖర్ రెడ్డిలు పావులు మాత్రమేనని అసలు ఎస్ఓ శంకర లక్ష్మి పాత్రపై కూడా విచారణ జరగాలన్నారు.
ఈ పేపర్ల లీక్ ల వెనుక , ప్రశ్నాపత్రాలు బయటకు వెళ్లడం వెనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కేటీఆర్, హరీష్ రావుకు సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar Alleged). ప్రవీణ్ కు 103 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
ప్రతి పేపర్ కూడా లీక్ అయ్యిందని మండిపడ్డారు. గతంలో ఎంపికైన వారిపై కూడా విచారణ చేపట్టాలన్నారు. వాళ్లు ఎలా ఎంపికయ్యారనే దానిపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. ఆర్టికల్ 371 ప్రకారం పవర్స్ ఉపయోగంచి గవర్నర్ వెంటనే చైర్మన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : రద్దయిన టీఎస్పీఎస్సీ పరీక్షలు ఇవే