RS Praveen Kumar : ఇంకెంత కాలం మోసం చేస్తారు

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కామెంట్

RS Praveen Kumar : ప్ర‌జ‌ల‌ను, నిరుద్యోగుల‌ను ఇలా ఇంకెంత కాలం మోసం చేస్తారంటూ నిప్పులు చెరిగారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పేప‌ర్ లీకేజీపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల జీవితాలో ఆడుకుంటున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భారీ ఎత్తున పేప‌ర్ లీకేజీ కొన‌సాగినా ఇప్ప‌టి వ‌ర‌కు బాధ్య‌త క‌లిగిన సీఎం కేసీఆర్ ఎందుకు మీడియా ముందుకు రాలేద‌ని పేర్కొన్నారు. గ‌తంలో రాజ్యాంగాన్ని మార్చాల‌న్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విష‌యంలో మాట్లాడిన కేసీఆర్ టీఎస్పీఎస్సీ విష‌యం ఎందుకు స్పందించ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

30 ల‌క్ష‌ల నిరుద్యోగ విద్యార్థుల జీవితాల గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని నిల‌దీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినా ఇంకా మ‌న‌కు విముక్తి ల‌భించ‌డం లేద‌ని అన్నారు. రాష్ట్రం వ‌చ్చాక ఓయూకు రావాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌య్యారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆర్ఎస్పీ.

నేరం జ‌రిగాక సిట్ కు కేసు అప్ప‌గిస్తే ఎలా అని ఫైర్ అయ్యారు. ఈ మ‌ధ్య కాలంలో ముఖ్య‌మైన ఆధారాలు చెరిపేసి ఉంటార‌ని ఆవేద‌న చెందారు. త‌మ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న స‌ర్కార్ ఎందుక‌ని తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, స‌భ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయలేద‌ని ప్ర‌శ్నించారు. ప్రాజెక్టుల పేరుతో క‌మీష‌న్లు తీసుకున్న ప్ర‌భుత్వం అందులో ఒక్క శాతం ఖ‌ర్చు చేసినా ఓయూ యూనివ‌ర్శిటీ హార్వ‌ర్డ్ విశ్వ విద్యాల‌యంగా మారేద‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar).

Also Read : బీజేపీ మంత్రి ఆస్తులు రూ.1,609 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!