RS Praveenkumar KCR : కేసీఆర్ కు అంత డబ్బు ఎక్కడిది
ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రశీణ్ కుమార్
RS Praveen Kumar KCR : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించారు.
భారత రాష్ట్ర సమితి చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ 2024లో జరిగే ఎన్నికల్లో మొత్తం ఖర్చు తానే పెట్టుకుంటానని చెప్పారంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ బాంబు పేల్చాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ సందర్భంగా ఎన్ని వేల కోట్లు ఉంటే ఈ మాట కేసీఆర్ అంటాడని పేర్కొన్నారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar KCR).
నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు కేసీఆర్ తెలంగాణ పేరుతో అందినంత మేర దండుకున్నాడని ఆరోపించారు. బలిదానాలు, ఆత్మ త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి, అక్రమాలకు , స్కాంలకు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఎన్ని వేల కోట్లు వెనకేసుకుంటే దేశమంతా ఖర్చు పెట్టేందుకు ఇంత ధైర్యం వస్తుందని ప్రశ్నించారు. అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదానీ దేశాన్ని దోచుకున్నారో అదే రీతిన కేసీఆర్(KCR) అండ్ కంపెనీ తెలంగాణను కూడా దోచుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. స్కీములేమో ప్రజలకు స్కామ్ లేమో మీకా అని నిలదీశారు.
Also Read : కేసీఆర్ ఎన్నికల ఖర్చుపై ఆకునూరి ఫైర్