Dattatreya Hosabale : పేదరికం..నిరుద్యోగంపై ఆర్ఎస్ఎస్ ఫైర్
సైద్దాంతిక గురువు దత్తాత్రేయ హోసబాలే
Dattatreya Hosabale : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై కాషాయ అనుంగు సంస్థగా పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిప్పులు చెరిగింది. ప్రధానంగా పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక గురువు , ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే(Dattatreya Hosabale).
అంతర్గత కలహాలు, వాతావరణ మార్పు పేదరికానికి అసలైన కారణమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అసమానతల పరంగా ఇవాళ దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. 20 కోట్ల మందికి పైగా పేదలు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని దశాబ్దాలుగా అమలు చేసిన ఆర్థిక విధానాలే ఈ పరిస్థితికి కారణమని దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వేదశీ జాగరణ్ మంచ్ తన స్వబలంబి భారత్ అభియాన్ (స్వయం మద్దతు గల భారత దేశం ప్రచారం ) లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పురోగతి ఉన్నప్పటికీ దేశం సవాళ్లను ఎదుర్కొనే కొన్ని రంగాలు ఇంకా ఉన్నాయని హోసబాలే స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కంటే ముందు హోసబాలే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
23 కోట్ల మంది కంటే ప్రజలు రోజుకు రూ. 275 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారని ఆవేదన చెందారు. దేశంలో నాలుగు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని లేబర్ ఫోర్స్ సర్వే నిరుద్యోగిత రేటు 7.6 శాతంగా ఉందన్నారు.
Also Read : సోరేన్ పాస్ బుక్..చెక్కులు స్వాధీనం