Rupee Closes All Time Record : కనిష్ట స్థాయికి చేరిన రూపాయి
డాలర్ తో పోలిస్తే రూ. 82.33
Rupee Closes All Time Record : ప్రపంచ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారతీయ రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత ప్రభావం చూపనుంది.
తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి ధర రూ. 82.33 వద్ద(Rupee Closes All Time Record) ముగిసింది. కరెన్సీ 82.19 వద్ద ప్రారంభమైంది. రోజు ప్రారంభంలో 82.33 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది వరుసగా 10 శాతానికి పైగా పడి పోయింది. ప్రధానంగా అమెరికా బాండ్ రాబడులు పెరగడం, ఇన్వెస్టర్లలో రిస్క్ లేని సెంటిమెంట్ , క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ 16 పైసలు క్షీణించింది.
ఉదయం డాలర్ కు రూ. 82.30 వద్ద ట్రేడ్ జరిగింది. మునుపటి ముగింపు 81.89 నుండి 0. 5 శాతం తగ్గింది. కరెన్సీ 82.19 వద్ద ప్రారంభమై 82.33 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ఇప్పటి దాకా రూపాయి కోలుకోలేదు. భారతీయ కరెన్సీ మొదటిసారిగా గ్రీన్ బ్యాక్ తో పోలిస్తే 82 స్థాయికి దిగువన ముగిసింది.
అమెరికా కరెన్సీతో పోలిస్తే 55 పైసలు పతనమై రికార్డు స్థాయిలో 82.17 వద్ద ముగిసింది. ముడి ధరల పెరుగుదల వాణిజ్య లోటు గురించి ఆందోళనలకు కారణమైంది. యుఎస్ రేట్లు ఎక్కువ కాలం ఉండటం మూల ధన ఖాతాకు సహాయం చేయక పోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
పదే పదే క్షీణించడం వల్ల ఆర్థిక రంగం కుదేలుగా మారే ప్రమాదం ఉంది.
Also Read : సింగపూర్ లో అంబానీ ఫ్యామిలీ ఆఫీస్