Russia Ukraine Blast : ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఎవరి మాటలను వినిపించు కోవడం లేదు. ఓ వైపు బాంబుల మోత ఇంకో వైపు మిస్సైళ్ల దాడులతో దద్దరిల్లుతోంది ఉక్రెయిన్.
ఓ వైపు చర్చలకు రెడీ అంటూనే ఇంకో వైపు ఉక్రెయిన్ (Russia Ukraine Blast)ను సర్వ నాశనం చేసే దిశగా అడుగులు వేస్తోంది రష్యా, ఐక్య రాజ్య సమితితో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ హెచ్చరికలు జారీ చేసినా బేఖాతర్ చేయలేదు.
ఇప్పటి దాకా ఉక్రెయిన్ లో 300 మందికి పైగా సాధారణ పౌరులతో పాటు వందలాది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది బిక్కు బిక్కుమంటూ పొట్ట చేత పట్టుకుని పోలాండ్ , మోల్టోవాతో సహా పొరుగు దేశాలకు పారి పోయారు.
సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. రష్యా చీఫ్ వ్లాదిమిర పుతిన్ ప్రకటించిన మిలటరీ ఆపరేషన్ ఇవాళ్టితో నాలుగో రోజుకు చేరుకుంది. ఎన్ని దాడులు చేసినా ఉక్రెయిన్ తల వంచడం లేదు.
రాజధాని కైవ్ పై దాడికి పాల్పడింది. భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లు జులియానీ విమానాశ్రయం సమీపంలో ఇంకొకటి చమురు గిడ్డంగిలో ఉందని ఉక్రెయిన్ (Russia Ukraine Blast)ప్రకటించింది.
అధికారిక అంచనా ప్రకారమే ఏకంగా 1 , 50, 000 మందికి పైగా పౌరులు దేశం విడిచి వెళ్లి పోయారని తెలిపింది. ఉక్రెయిన్ పై దాడితో చమురు ధరలు కొండెక్కాయి.
ఉక్రెయిన్ చీఫ్ వోలోడిమిర్ జెలన్స్కీ ఈ దేశాన్ని రక్షించుకునేందుకు అవసరమైనంత కాలం పోరాడుతామని హెచ్చరించారు.
Also Read : రణ రంగం మారణ హోమం