Russia Used Drones : ఇరాన్ డ్రోన్లను ఉపయోగించిన రష్యా
ఆరోపించిన ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ
Russia Used Drones : రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. ఏకంగా 75 మిస్సైళ్లను ఇప్పటి వరకు ఉపయోగించిందని ఆరోపించారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 5 మంది చని పోయారని తెలిపారు. అంతే కాకుండా దాడులలో రష్యా ఇరాన్ డ్రోన్(Russia Used Drones) లను ఉపయోగించిందని మండిపడ్డారు.
ఉక్రెయిన్ రాజధాని కైవ్ , దక్షిణ, పశ్చిమాన ఉన్న నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగ బడిందని ఉక్రెయిన్ మిలటరీ చీఫ్ చెప్పారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే రష్యా దాడులకు తెగ బడిందంటూ మండిపడ్డారు. సోమవారం రద్దీ సమయంలో ఉక్రెయిన్ నగరాలను టార్గెట్ చేసి దాడులు చేపట్టిందని వాపోయారు జెలెన్ స్కీ.
ఇదిలా ఉండగా క్రిమియన్ వంతెనపై పేలుడు జరిగిన తర్వాత స్పష్టమైన ప్రతీకర దాడులకు దిగిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇప్పటి వరకు 75కి పైగా మిస్సైళ్లను రష్యా వాడిందంటూ ధ్వజమెత్తారు.
యుద్దం ప్రారంభ వారాల్లో రష్యా రాజధానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని విరమించుకున్న తర్వాత ప్రస్తుతం జరుగుతున్న దాడులు అత్యంత భారీగా ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశానికి సంబంధించిన ఇంధన మౌలిక సదుపాయాలను కావాలని ధ్వంసం చేసిందని పేర్కొన్నారు జెలెన్ స్కీ.
మొదట నగరాలను టార్గెట్ చేశారు. ఆ తర్వాత ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు జెలెన్ స్కీ. మరో వైపు మూకుమ్మడి దాడులను అమెరికా, యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
Also Read : ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి