Rythu Bandhu KCR : రైత‌న్న‌ల‌కు కేసీఆర్ ఖుష్ క‌బ‌ర్

28 నుంచి రైతు బంధు ఖాతాల్లోకి

Rythu Bandhu KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైత‌న్న‌ల‌కు శుభ‌వార్త చెప్పారు. ఈనెల 28 నుంచి రైతుల కోసం రైతు బంధు ప‌థ‌కం కింద వారి ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 66 ల‌క్ష‌ల మందికి రూ. 7 వేల కోట్ల సాయం చేసిన‌ట్లు తెలిపారు.

ఎక‌రం పొలం నుంచి చివ‌రి అన్న‌దాత వ‌ర‌కు ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది స‌ర్కార్. వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి సంక్రాంతి లోపు పంట సాయం పూర్తి కావాల‌ని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు 57 వేల కోట్ల న‌గ‌దు రైతు బంధు(Rythu Bandhu KCR)  కింద జ‌మ చేశామ‌ని పేర్కొన్నారు.

అంతే కాకుండా ఇటీవ‌ల కొనుగోలు చేసిన వారికి కూడా ఈ స్కీం వ‌ర్తింప చేయాల‌ని సీఎం ఆదేశించారు. పంట సీజ‌న్ కంటే ముందే రైతుల ఖాతాల్లో న‌గ‌దు జమ కానుంది. వ్య‌వ‌సాయం సాగుకు సంబంధించి పెట్టుబ‌డి సాయం కింద దీనిని అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇక రైతు బంధు స్కీం కింద ప్ర‌తి రైతుకు ల‌బ్ది చేకూర‌నుంది.

ఈ సీజ‌న్ లో 66 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది. వీరంద‌రికీ రైతు బంధు సాయం కింద రూ. 7,600 కోట్లు జ‌మ చేయ‌నుంది ప్ర‌భుత్వం. పోయిన సీజ‌న్ వ‌ర‌కు రూ. 57, 881 కోట్ల‌ను అంద‌జేసింది సాయం కింద‌. సీఎం ఆదేశాల మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ రెవిన్యూ శాఖ నుంచి వివ‌రాలు సేక‌రించ‌నుంది.

కొత్త‌గా చేరిన వారి వివ‌రాలు కూడా చేరితే మొత్తం ల‌బ్దిదారుల సంఖ్య పెర‌గ‌నుంది.

Also Read : జ‌న‌వ‌రి 26 నుంచి ‘ప్ర‌జా యాత్ర’ – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!