Mantralayam Hundi : పోటెత్తిన భక్తజనం ఆదాయం ఘనం
మంత్రాలయ పీఠం హుండీ లెక్కింపు
Mantralayam Hundi : శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. ఆదోని జిల్లాలోని మంత్రాలయంలో కొలువు తీరిన శ్రీ రాఘవేంద్రుడికి నిత్యం పూజలు కొనసాగుతుంటాయి. ఇటు ఏపీ, తెలంగాణ అటు కర్ణాటకకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు ఇక్కడికి. తమిళనాడు నుంచి కూడా గణనీయంగా దర్శించుకుంటారు. ప్రధానంగా ఆ రాఘవేంద్రుడిని కొలిచే వారిలో ప్రముఖ నటుడు , తలైవా రజనీకాంత్ కాగా మరొకరు నటుడు, దర్శకుడు లారెన్స్. ఈ ఇద్దరికీ స్వామి వారంటే విపరీతమైన భక్తి. ప్రతి ఏటా ఒకసారి మంత్రాలయాన్ని సందర్శిస్తారు. ఆ రాఘవేంద్రుడిని దర్శించుకుని పీఠాధిపతి ఆశీస్సులు అందుకుంటారు.
ఇదిలా ఉండగా మంత్రాలయం(Mantralayam) మఠం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా గణనీయమైన ఆదాయం హుండీ ద్వారా సమకూరింది. ఇది ఓ రికార్డు గా పేర్కొంది ఆలయ నిర్వాహకులు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఈసారి విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. అటు వైపు తిరుమల ఇటు వైపు మంత్రాలయం(Mantralayam) మఠం నిండి పోయాయి భక్తులతో.
సెలవులు రావడంతో దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానుకలు వెల్లువెత్తాయి. గత 34 రోజుల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 53 లక్షలు విరాళాల రూపేణా వచ్చాయి. వీటితో పాటు అదనంగా 197 గ్రాముల బంగారం, ఒక కేజీ 187 గ్రాముల వెండి కూడా భక్తులు సమర్పించుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు.
Also Read : KTR Slams