S Jai Shankar : పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన జై శంకర్
ఉగ్రవాదంపై నీతులు చెబితే ఎలా
S Jai Shankar : పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar). అమెరికాపై దాడులకు పాల్పడటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాడులకు పాల్పడిన ఒసామా బిన్ లాడెన్ లాంటి నరరూప రాక్షసులకు, కరడుగట్టిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ కు ఉగ్రవాదం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
తమ దేశంలో ముంబై, పార్లమెంట్ పై దాడికి పాల్పడిన వారికి ఎవరు మద్దతు పలికారో యావత్ ప్రపంచానికి తెలుసన్నారు జై శంకర్. తమకు నీతులు చెప్పేంత సీన్ ఆ దేశానికి లేదన్నారు. ఇదిలా ఉండగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను మరోసారి లేవనెత్తేందుకు యత్నించింది పాకిస్తాన్.
దీనిపై సీరియస్ గా స్పందించారు జై శంకర్. కరోనా మహమ్మారి కంటే అత్యంత ప్రమాదకరంగా ఉగ్రవాదం తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పు , సంఘర్షణ లేదా ఉగ్రవాదం ఇప్పుడు కీలకమైన సవాళ్లుగా మారాయని అన్నారు విదేశాంగ శాఖ మంత్రి.
బహుపాక్షికతను సంస్కరించే ఆవశ్యకతపై తాము ప్రధానంగా ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. సెక్యూరిటీ కౌన్సిల్ కు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సందర్బంగా జరిగిన కీలక సమావేశంలో సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చేసే కుట్రలకు, బెదిరింపులకు తాము భయపడమన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఘనత పాక్ కు ఉందన్నారు.
18 ఏళ్ల కిందట డిసెంబర్ 13న పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా , జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఎలా దాడులకు పాల్పడ్డారో మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు జై శంకర్.
Also Read : చైనా కళ్లద్దాలతో చూస్తే దేశం కనిపించదు